Saturday 7 April 2012

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని ప్రభుత్వాన్ని..

శ్రీనివాస రెడ్డి గారి బదిలీ మీద నా ఆక్రోశము....

ఒక నిజాయితీ గల అధికారిని సమయం సందర్భం లేకుండా బదిలీ చెయ్యడము ఏవిధమైన న్యాయము? సమస్యలని వెలుగు లోకి తీసుకు వచ్చే మీడియా ఈ విషయాన్ని అంత తేలికగా ఎందుకు పోనిస్తోంది? మళ్ళీ ఇలాంటి కుతంత్రానికి పాల్పడే సాహసము ఎవరూ చెయ్యలేని విధము గా చీల్చి చెండాడక్కర లేదా? రాజకీయ నాయకుల బినామీలు బయల్పడగానే అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళన అంత తొందర గా గుర్తుకు వచ్చిందా? ఎప్పటికి బాగు పడుతుంది దేశం? ప్రశ్నించే వారికి మరణ దండన విధించే ముష్కర మూకల రాజ్యము మనకి ఎందుకు? ఇలా నగ్న నృత్యం చేసే నీచ నాయకులని మట్టి లో కలపలేని యంత్రాంగము ఎందుకు? ప్రతీ సారీ ప్రజాగ్రహమే మందు కాదు. శక్తి అధికారము ఉన్న ఉన్నతాధికారులు కొంతైనా దేశము కొరకు ఆలోచించాలి. సమాజ సేవ కోసం సమయము వెచ్చించే మహానుభావులు ఒక్కరైనా ఇలా ఎందుకు అని ప్రశ్నించలేరా? కలమే మా ఆయుధము అనే ఆంధ్రభూమి, ఆంధ్ర జ్యోతి, ఈనాడు లాంటి పత్రికలూ ఏమీ జరగనట్టు ఊరుకోవడము ఎంత న్యాయము?

సీతారామం