Sunday 21 March 2010

ఇది నా తొలి అడుగు

పెద్దలకు నమస్కారములు,

నేను కొన్ని పుస్తకాలు చదివాను (నవలలు, కథలు, పోస్టులు, అన్ని రకాలుగా ప్రింట్ అయినవి). కొన్ని సార్లు నా భావాలను వ్యక్తీకరించాను బ్లాగులలో పోస్టింగ్ ల ద్వారా. మిత్రులు కొంతమంది రెచ్చగొట్టడం తో రెచ్చబడి (ఈ పద ప్రయోగం నా స్వంతం కాదు సుమా) ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఇప్పుడు ఒక బ్లాగ్ తయారు చేస్తున్నాను, నా విమర్శలను ఒక చోట ఉంచడానికి. అసలు విమర్శ అవసరం ఏమిటి? రచయిత దృక్కోణం నుంచి కాక మరో కొత్త కోణాన్ని చూడడమే విమర్శ తొలి లక్ష్యం. ఈ రంగంలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. వారి అడుగు జాడల లో కొన్ని అడుగులైనా వెయ్యలేక పోతానా అనే నమ్మకం తో ఈ బ్లాగు ని ప్రారంభించాను.

అందరి సలహాలు, సంప్రదింపుల కోసం ఎదురుచూస్తూ

బుధజన విధేయుడు

సీతారామం

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీ తోలి అడుగు చూసి చాల ఆనందం కలిగింది. చాల మంచి పని చేస్తున్నారు. మీ మిత్రులు రెచ్చ కొట్టినందుకు చేసిన, చేయాలనీ ముందు అడుగు వేసింది మీరే కదా? అందుకే మీ ప్రయత్నానికి జుహర్లు ! ఇంకా మీ విమర్శలు వినడానికి చాట్ చేయకుండా ఇక్కడికి వస్తే చదువచ్చు :)

    ReplyDelete
  3. I think I'm the last one ( through Gollapudi's blog ) in the list of people who have made you start a blog.

    ReplyDelete
  4. సందీప్ గారు, & మాధురి గారు,

    మీ కామెంట్స్ కి నా కృతజ్ఞతలు. మీరు కొంత టైం తీసుకుని నా మిగిలిన పోస్ట్స్ పైన కూడా మీ అభిప్రాయాలు చెపితే, ఈ బ్లాగ్ కి ఇంకా మంచి రూపు తేవచ్చు.
    సీతారామం

    ReplyDelete